అడిలైడ్: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా.. రెండో టెస్టును చేజిక్కించుకోవాలని ఉవ్విలూరుతున్నది. అడిలైడ్ వేదికగా (Adelaide Test) జరుగుతున్న డే నైట్ టెస్టులో.. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పెర్త్ టెస్టు విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమ్ఇండియా.. అడిలైడ్‌లో అదే కాంబినేషన్ కొనసాగిస్తున్నది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్‌కు దిగనున్నారు. ఇక హిట్‌మ్యాన్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రానున్నారు. ఇక వాషింగ్టన్ సుందర్, పడికల్, ద్రువ్ జురెల్‌ను పక్కకుపెట్టిన టీమ్ఇండియా.. రోహిత్, గిల్, అశ్విన్‌తో బరిలోకి దిగుతున్నది. ఆస్ట్రేలియా కూడా జట్టులో ఒక మార్పుచేసింది. గాయపడిన హేజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్‌ను తీసుకున్నది.
తుది జట్లు..
భారత్: జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, రోహిత్, పంత్, అశ్విన్, నితీశ్‌కుమార్, రానా, బుమ్రా, సిరాజ్.
ఆస్ట్రేలియా: ఖవాజ, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, క్యారీ, కమిన్స్, స్టార్క్, లియాన్, బోలాండ్