కాన్పూర్: బంగ్లాదేశ్‌తో(India Vs Bangladesh) జరుగుతున్న రెండో టెస్టులో.. టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకున్నది. కాన్పూర్ పిచ్ సీమర్లకు అనుకూలించనున్నది. అందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పిచ్ చాలా సాఫ్ట్‌గా ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. తొలి టెస్టులో ఆడిన జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతున్నది. బంగ్లా కెప్టెన్ శాంతో మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమన్నాడు. తొలి టెస్టులో తమ బౌలర్లు బాగానే బౌలింగ్ చేసినట్లు చెప్పాడు. అయితే బ్యాటర్లు భారీ స్కోర్లపై దృష్టి పెట్టాలన్నాడు. బంగ్లా జట్టు నుంచి నహిద్, తస్కిన్ ఔటయ్యారు. వారి స్థానంలో ఖాలిద్, తైజుల్ రెండో టెస్టులో ఆడనున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే ఇండియా 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
🚨 Team Update 🚨
An unchanged Playing XI for #TeamIndia 👌👌
Live – https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/u61vd44i1C
— BCCI (@BCCI) September 27, 2024