ఖాట్మాండు: దక్షిణాసియా అండర్-19 ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. శనివారం ఇక్కడి దశరథ స్టేడియంలో జరిగిన ఫైనల్లో యువ భారత్ 3-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది.
భారత్ తరఫున మంగ్లేనాథాంగ్ కిప్జెన్ (64వ, 85వ నిమిషాల్లో) డబుల్ ధమాకా మోగించగా.. గొయారి (90+5వ ని.లో) ఒక గోల్ సాధించాడు. ఈ టోర్నీలో యువ భారత జట్టుకు ఇది ఎనిమిదో టైటిల్ కావడం విశేషం.