అమ్మాయిల తొలి విజయం.. శ్రీలంకపై భారత్ గెలుపు
ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఆతిథ్య శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
కొలంబో: ఈ ఏడాది స్వదేశంలో జరగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఆతిథ్య శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 39 ఓవర్లకే కుదించగా.. భారత స్పిన్నర్లు స్నేహ్ రాణా (3/31), దీప్తి శర్మ (2/22) రాణించి లంకను 38.1 ఓవర్లలో 147 పరుగులకే కట్టడిచేశారు.
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి (2/26) అరంగేట్ర మ్యాచ్‌లో అదరగొట్టింది. యువ పేసర్ కాశ్వీ గౌతమ్ వికెట్లేమీ తీయకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. లంక బ్యాటర్లలో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్. ఛేదనలో టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (50 నాటౌట్), హర్లీన్ డియోల్ (48 నాటౌట్), స్మృతి మంధాన (43) మెరవడంతో లక్ష్యాన్ని భారత్.. 29.4 ఓవర్లలో పూర్తిచేసింది. ప్రతీకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సిరీస్‌లో భారత్.. మంగళవారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

