Aus Vs Ind | బ్రిస్బేన్: భారత మహిళల క్రికెట్ జట్టు కుప్పకూలింది. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు దారుణంగా విఫలమైన వేళ టీమ్ఇండియా 34.2 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (23), హర్లిన్ డియోల్ (19) అంతోఇంతో ఫర్వాలేదనిపించారు.
మేగన్ స్కట్ (5/19) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 9 పరుగులకే ఓపెనర్ మంధాన (8) వికెట్ కోల్పోయిన టీమ్ఇండియా ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో 102/5 స్కోరు చేసింది. జార్జియా వాల్ (46 నాటౌట్), లిచ్ఫీల్డ్ (35) జట్టుకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. ఐదు వికెట్లతో భారత పతనాన్ని శాసించిన స్కట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.