జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత మహిళా జట్టుకు ఎట్టకేలకు ఓ విజయం దక్కింది. ఇరుజట్ల మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదికగా శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో టీమ్ఇండియా.. 14 పరుగుల తేడాతో సఫారీలను ఓడించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దీప్తి శర్మ ఆల్‌రౌండ్ షో తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 185 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (43), దీప్తి శర్మ (36 నాటౌట్), వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (34 నాటౌట్) పర్యాటక జట్టుకు భారీ స్కోరు అందించారు. ఛేదనలో సౌతాఫ్రికా చేరువగా వచ్చినా సరిగ్గా ఓవర్లకు 171/9 వద్దే ఆగిపోయింది. సునె లుస్ (40), తజ్మిన్ బ్రిట్స్ (30) పోరాడినా ఆ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. ఇరుజట్లూ సోమవారం బెనొనిలో ఆఖరి టీ20 ఆడతాయి.