Team India | దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ గెలుపు.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ భారత్ సొంతం
అమ్మాయిలు అదరగొట్టారు. పరుగుల వరదకు చిరునామా అయిన చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాను భారత్ చెడుగుడు ఆడుకుంది. హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మంధాన సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. సఫారీ బౌలర్లను కసిగా వేటాడుతూ ఈ నాయక ద్వయం శతక గర్జన చేసింది.
- శతక గర్జన
- కౌర్, మంధాన సూపర్ సెంచరీలతో విజృంభణ
- వోల్వార్డ్, మరిజానె కాప్ సెంచరీలు వృథా
- రెండో వన్డేలో రికార్డుల హోరు
- భారత్ 325/3, దక్షిణాఫ్రికా 321/6
అమ్మాయిలు అదరగొట్టారు. పరుగుల వరదకు చిరునామా అయిన చిన్నస్వామి స్టేడియంలో దక్షిణాఫ్రికాను భారత్ చెడుగుడు ఆడుకుంది. హర్మన్‌ప్రీత్‌కౌర్, స్మృతి మంధాన సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. సఫారీ బౌలర్లను కసిగా వేటాడుతూ ఈ నాయక ద్వయం శతక గర్జన చేసింది. కౌర్, మంధాన వీరవిహారంతో భారత్ భారీ స్కోరు అందుకుంది. లక్ష్యఛేదనలో ఆదిలో తడబడ్డ దక్షిణాఫ్రికా..వోల్వార్డ్, కాప్ శతకాలతో అద్భుత పోరాట పటిమ కనబరిచింది. ఏ దశలోనూ పట్టువదలని టీమ్ఇండియా నాలుగు పరుగుల తేడాతో సఫారీలను మట్టికరిపించి మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 646 పరుగులతో మహిళల వన్డే చరిత్రలో కొత్త రికార్డుతో పాటు పలు ఫీట్లు బద్దలయ్యాయి.
Team India | బెంగళూరు: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా బుధవారం ఉత్కంఠగా జరిగిన ‘హై స్కోరింగ్ థ్రిల్లర్’లో టీమ్ఇండియా.. 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. స్మృతి మంధాన (120 బంతుల్లో 136, 18 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా రెండో సెంచరీతో కదం తొక్కగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది.
మాల్బకు(2/51) రెండు వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో 67 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా.. సారథి లారా వోల్వార్డ్ (135 బంతుల్లో 135 నాటౌట్, 12 ఫోర్లు, 3 సిక్సర్లు), మరిజానె కాప్ (94 బంతుల్లో 114, 11 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టు 321/6 వద్దే ఆగి విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా అందుకు మూల్యం చెల్లించుకుంది. పూజ వస్ర్తాకర్(2/54), దీప్తిశర్మ(2/56) రెండేసి వికెట్లు తీశారు. కౌర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
1 మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో మంధాన, హర్మన్‌ప్రీత్‌కౌర్, వోల్వార్డ్, కాప్ సెంచరీలు చేశారు.
1 స్వదేశంలో వన్డేల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు(325/3)
15 రెండో వన్డేలో నమోదైన సిక్స్‌లు. మహిళల వన్డేలో ఇదే అత్యధికం.
646 మహిళల వన్డేల్లో ఇది రెండో అత్యుత్తమ స్కోరు. 2017లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో 678 పరుగులు నమోదయ్యాయి.
సంక్షిప్త స్కోర్లు
సంక్షిప్త స్కోర్లు: భారత్: 50 ఓవర్లలో 325/3(మంధాన 136, హర్మన్‌ప్రీత్‌కౌర్ 103 నాటౌట్, మాల్బ 2/51, క్లాస్ 1/67), దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 321/6(వోల్వార్డ్ 135 నాటౌట్, కాప్ 114, వస్ర్తాకర్ 2/54, దీప్తి 2/56)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

