అస్తానా : వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత యువ బాక్సర్లు సాక్షి, నూపుర్, జాస్మిన్ పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన మహిళల 54కిలోల ఫైనల్ బౌట్లో రెండు సార్లు వరల్డ్ యూత్ చాంపియన్ సాక్షి.. యోసిలిన్ పెరెజ్(అమెరికా)పై అలవోక విజయం సాధించింది. తన జోరు కనబరిచిన సాక్షి..ప్రత్యర్థిపై పవర్ఫుల్ పంచ్లతో చెలరేగింది.
సాక్షి(54కి), నూపుర్ (80కి) ప్రత్యర్థులపై గెలిచి స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. దీంతో టోర్నీలో భారత్కు మూడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు, మూడు కాంస్య పతకాలు దక్కాయి. జుగ్ను (85కి), పూజారాణి(80కి) ప్రత్యర్థుల చేతిలో ఓడి రజతాలు దక్కించుకున్నారు.