IND vs SL : భారత బౌలర్లు విజృంభించడంతో శ్రీలంక జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఐదో వికెట్‌గా భానుక రాజపక్స (10) అవుట్ అయ్యాడు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. హార్ధిక్ పాండ్యా క్యాచ్ పట్టడంతో రాజపక్స వెనుదిరిగాడు. అంతకు ముందు ఓవర్లో ప్రమాదకరంగా మారుతున్న కుశాల్ మెండిస్(28)ను హర్షల్ పెవలియన్‌కు పంపాడు. ఉమ్రాన్ మాలిక్ , అసలంకను మూడో వికెట్‌గా వెనక్కి పంపాడు. 12 రన్స్ చేసిన అతను కీపర్ ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం , దసున్ శనక (18), వనిందు హసరంగ (1) క్రీజులో ఉన్నారు.
శివం మావి వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బతీశాడు. రెండో ఓవర్లో ఓపెనర్ పథుమ్ నిస్సంక మావి బౌలింగ్‌లో అతను బౌల్డ్ అయ్యాడు. నాలుగో ఓవర ఓవర్ ఐదో బంతికి డిసిల్వా(8)ను అవుట్ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 162 పరుగులు చేసింది.