Asia Cup | దంబుల్లా: ఆసియాకప్‌లో టైటిల్ పోరుకు వేళయైంది. ఆదివారం డిఫెండింగ్ చాంపియన్ భారత్, ఆతిథ్య శ్రీలంక మధ్య ఫైనల్ ఫైట్ జరుగనుంది. ఓటమన్నదే ఎరుగకుండా టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమ్ఇండియా..ఫైనల్లోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నది. రికార్డు స్థాయిలో ఇప్పటికే ఏడుసార్లు ఆసియా విజేతగా నిలిచిన భారత్..మరోమారు టైటిల్‌ను ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నది. ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలీవర్మ సూపర్ ఫామ్‌లో జట్టుకు బాగా కలిసిరానుంది.
బౌలింగ్‌లోనూ రేణుకాసింగ్తో పాటు హైదరాబాదీ స్పీడ్‌స్టర్ అరుంధతిరెడ్డి..ప్రత్యర్థి బ్యాటర్లకు పరీక్ష పెడుతున్నారు. మరోవైపు టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న శ్రీలంక..సొంతగడ్డపై టైటిల్‌ను ఒడిసిపట్టుకోవాలని చూస్తున్నది. కెప్టెన్ చమరీ ఆటపట్టు 243 పరుగులతో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నది. బ్యాటింగ్ పరంగా బలంగా ఉన్నా..బౌలింగ్ బలహీనత లంకను దెబ్బతీసే అవకాశముంది.