ముంబై: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగియగానే భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈనెల 24, 27, 29 తేదీలలో టీమ్ఇండియా.. కివీస్‌తో వన్డేలు ఆడనుంది. ఇదే సమయంలో న్యూజిలాండ్ పురుషుల జట్టు సైతం భారత గడ్డపై మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.