SAFF Championship 2023 | వరుస విజయాలతో జోరుమీదున్న భారత ఫుట్‌బాల్ జట్టు.. తొమ్మిదోసారి దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (సాఫ్) టైటిల్ చేజిక్కించుకుంది. టోర్నీ ఆసాంతం ఓటమి ఎరుగకుండా సత్తాచాటిన భారత్.. ఫైనల్లో కువైట్‌ను ఓడించింది. పెనాల్టీ షూట్లో 5-4 తేడాతో విజయం సాధించి సాఫ్ టైటిల్ గెలుచుకుంది.
సునీల్ ఛెత్రీ సారథ్యంలోని బారత ఫుట్‌బాల్ జట్టు కొంతకాలంగా అదరగొడుతోంది. భారత జట్టు జోరు చూస్తుంటే పూర్వవైభవం సాకారం కానుందనే అనిపిస్తోంది. స్వాత్రంత్యం ముందే భారత్‌కు ఈ ఆటలో ప్రత్యేకత స్థానం ఉంది. అయితే.. ఆ తర్వాత కాలంలో క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో ఒకింత ప్రాభవాన్ని కోల్పోయింది. ఈ ఏడాది టీమిండియా ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచింది. ఇంటర్కాంటినెంటల్ కప్‌లో భారత్ విజేతగా నిలిచి ఔరా అనిపించింది. ఫైనల్లో లెబనాన్‌పై 2-0తో గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. రెండేసి గోల్స్ చేసిన సునీల్ ఛెత్రీ, లాల్జింగులా చాంగ్టె టాప్‌లో నిలిచారు. బెంగళూరులో జరిగిన దక్షిణాసియా ఫుట్‌బాల్(సాఫ్) చాంపియన్‌షిప్‌లోనూ విజేతగా నిలిచింది.