ముంబై : సెషన్ సెషన్‌కూ ఆధిక్యం చేతులు మారుతూ విజయం ఇరుజట్లతో దోబూచులాడుతూ భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఓవల్ టెస్టు వీక్షణల్లోనూ సరికొత్త రికార్డు సృష్టించింది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదో టెస్టు ఐదో రోజు ఏకంగా 13 మిలియన్ల వ్యూస్ నమోదైనట్టు జియో హాట్‌స్టార్ తెలిపింది.
150 ఏండ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇంతమంది వీక్షించడం ఇదే ప్రథమం. ఇక మొత్తంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను వీక్షించినవారి సంఖ్య 170 మిలియన్లుగా నమోదైందని తెలిపిన జియోహాట్‌స్టార్.. సిరీస్ వాచ్ టైం 65 బిలియన్ నిమిషాలు అని వెల్లడించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ వ్యూస్ పరంగా ఇది కూడా రికార్డే. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైన విషయం తెలిసిందే.