Ind vs Aus | ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్‌లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట మొదలైంది. ప్రస్తుతం టీమ్ఇండియా 4 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ (70), శ్రీకర్ భరత్(10) ఉన్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 289/3తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా కాసేపటికే రవీంద్ర జడేజా (28) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. మర్ఫీ బౌలింగ్‌లో షాట్ కొట్టడానికి ప్రయత్నించిన జడేజా మిడాన్‌లో ఖావాజా చేతికి చిక్కాడు.
శుభ్‌మన్ గిల్ సెంచరీ
శనివారం నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో కదంతొక్కగా.. గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (128 బంతుల్లో 59 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (121 బంతుల్లో 42), కెప్టెన్ రోహిత్ శర్మ (35) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్, కునేమన్, మార్ఫి తలా ఒక వికెట్ పడగొట్టారు.