బెంగళూరు : భారత్ మరో మెగాటోర్నీ ఆతిథ్యానికి సిద్ధమవుతున్నది. 2029తో పాటు 2031 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు ఆత్యిథ్యమిచ్చేందుకు భారత్ బిడ్డింగ్‌లో పాల్గొనబోతున్నది. ఈ ఏడాది ఆఖర్లో మొదలుకానున్న ప్రక్రియలో పాలుపంచుకోబోతున్నట్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమరివాలా ఆదివారం పేర్కొన్నాడు.
బిడ్డింగ్‌లో పోటీపడ్డ దేశాలను అనుసరించి ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య 2026 సెప్టెంబర్‌లో ఆతిథ్య హక్కులు పొందిన దేశాల పేర్లను ప్రకటించనుంది. బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఆయా సభ్యదేశాలు ఈ ఏడాది అక్టోబర్ 1 ఆఖరి తేదీగా పేర్కొన్నారు. రెండు టోర్నీలకు సంబంధించి ఆతిథ్య హక్కులు సొంతం చేసుకునేందుకు మనకు మరికొంత సమయముందని సుమరివాలా తెలిపాడు