రాయ్‌పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డే(INDvSA)లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ బవుమా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. బవుమా, కేశవ్, ఎంగిడి జట్టుతో కలిశారు. భారత జట్టులో మాత్రం మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతున్నది. రాంచీలో జరిగిన ఫస్ట్ వన్డేలో ఇండియా 17 రన్స్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
Here’s a look at our Playing XI for the 2⃣nd #INDvSA ODI 🙌#TeamIndia have named an unchanged side.
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR@IDFCFIRSTBank pic.twitter.com/B4CQac3rE6
— BCCI (@BCCI) December 3, 2025
ఫోకస్ మొత్తం వాళ్లిద్దరి మీదే..
టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్, కోహ్లీ మీదే అభిమానుల దృష్టంతా కేంద్రీకృతమవుతున్నది. ఈ ఇద్దరి ఆట చూసేందుకు ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. రాంచీలో సుమారు 32 వేల మంది హాజరుకాగా రాయ్‌పూర్ సైతం ‘రోకో’కు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. వన్డేలకు ఆతిథ్యమివ్వడం రాయ్‌పూర్‌కు ఇది రెండోసారి మాత్రమే కావడంతో మైదానమంతా మరోసారి రోకో నామస్మరణ చేయనుంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ జోడీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో భారత జట్టు సైతం ఈ దిగ్గజ ద్వయం తమ మ్యాజిక్‌ను కొనసాగించాలని ఆశిస్తున్నది.
గత వన్డేలో విఫలమైన ఓపెనర్ జైస్వాల్, రుతురాజ్ ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తారో లేదో చూడాలి. బ్యాటింగ్ పరంగా భారత్‌కు బెంగేమీ లేకపోయినా రాంచీ వన్డేలో బౌలింగ్ మాత్రం వీక్‌గా కనిపించింది. ప్రత్యర్థి ఎదుట 350 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా టీమ్ఇండియాకు విజయమేమీ సులభంగా దక్కలేదు. అయితే రాయ్‌పూర్ పిచ్ సీమర్లకు అనుకూలం. గతంలో ఇక్కడ న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో భారత పేసర్లు నిప్పులు చెరిగారు. సఫారీ జట్టులో నాణ్యమైన పేసర్లున్న నేపథ్యంలో వారి బౌలింగ్ దాడిని భారత బ్యాటింగ్ లైనప్ ఏ మేరకు ఎదుర్కుంటుందో చూడాల్సిందే.