ఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్‌కప్ ఫైనల్- 2024ను భారత్ 4 పతకాలతో ముగించింది. ఈ పోటీలలో భాగంగా గురువారం జరిగిన మెన్స్ ట్రాప్ ఈవెంట్లో వివన్ కపూర్ రజతం దక్కించుకోగా మెన్స్ స్కీట్ కాంపిటీషన్లో అనంత్‌జీత్ సింగ్ నరుకాకు కాంస్యం దక్కింది.
ఫైనల్ బరిలో నిలిచిన ఆరుగురిలో వివన్.. 44 పాయింట్లు స్కోరు చేసి రజతం సాధించాడు. నరుకా 43 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం నెగ్గాడు. ఈ టోర్నీలో భారత్ 2 రజతాలు, 2 కాంస్యాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.