WTC | దుబాయ్: పెర్త్ టెస్టులో ఘనవిజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. స్వదేశంలో కివీస్‌తో సిరీస్‌ను 0-3తో కోల్పోయిన భారత్.. డబ్ల్యూటీసీ టేబుల్లో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజా విజయంతో భారత్.. 61.11 శాతంతో తిరిగి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియా (57.69 శాతం), శ్రీలంక (55.56 శాతం) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సైకిల్లో భారత్ 15 టెస్టులాడి 9 విజయాలు ఐదింట్లో ఓడి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.