ఆక్లాండ్: ఎఫ్ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఏకపక్ష సెమీఫైనల్లో 6-0 గోల్స్ తేడాతో చిలీ జట్టును చిత్తుగా ఓడించింది.
నవనీత్ కౌర్ (6వ, 13వ ని), దీపిక (14వ, 18వ ని) రెండేసి గోల్స్‌తో సత్తా చాటారు. నేమా (32వ ని), రుతుజా దాదాసో (39వ ని) చెరో గోల్ కొట్టారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.