T20 World Cup 2024 : ప్రపంచ క్రికెట్లో టోర్నీ ఏదైనా భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అంటే అభిమానులకు పండుగే. చిరకాల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్థాన్‌లు ఎక్కడ తలపడినా ఇరుదేశాల ఫ్యాన్స్‌తో స్టేడియం నిండిపోతుంది. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ 20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో దాయాది జట్లు మరోసారి విశ్వవేదికపై తలపడనున్నాయి.
దాంతో, ఆ మ్యాచ్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఒక్కో టికెట్ కనీస ధరను రూ.1.4 కోట్లుగా నిర్ణయించారు. అదనపు చార్జీ రూ. 4 లక్షలు కలిపి మొత్తంగా టికెట్ ధర రూ. 1.8 కోట్లు. అయినా సరే ఫ్యాన్స్ తగ్గేదేలే అంటున్నారు.
ఐసీసీ ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ టికెట్లను పబ్లిక్ బ్యాలట్(Public Ballot) ద్వారా అమ్ముతోంది. టికెట్ల ధరను 6 డాలర్ల నుంచి 25 డాలర్లుగా నిర్ణయించింది. భారతీయ కరెన్సీలో కనీస టికెట్ ధర రూ.497 కాగా అత్యధిక ధర రూ.2,070. ఈ విండో ద్వారా ఏకంగా 2.60 లక్షల టికెట్లను ఐసీసీ అమ్మకానికి పెట్టింది. వెబ్సైట్లో లాగిన్ అయ్యాక ఒక్కొక్కరు ఒక్క మ్యాచ్‌కు ఆరు టికెట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఎన్ని మ్యాచ్‌లకైనా ఒక్కరు ఆరేసి టికెట్లకు అప్లై చేయవచ్చు. అంటిగ్వా సమయం ప్రకారం ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి 23 గంటల 59 నిమిషాల వరకు టికెట్లకు అప్లై చేసుకొనే వీలుంది.
భారత్, పాకిస్థాన్‌లు నిరుడు ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. అయితే.. ఈ రెండు టోర్నీలోనూ దాయది జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. మళ్లీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మోగా టోర్నీ జూన్ 1వ తేదీన షురూ కానుంది. జూన్ 9వ తేదీన న్యూయార్క్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సరిగ్గా లేని కారణంగా భారత్, పాక్‌లు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)ల్లో మాత్రమే పోటీపడుతున్నాయి. దాంతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్(Netflix) ఇండో పాక్ జట్ల మధ్య ఉన్న క్రికెట్ వైరాన్నిడాక్యుమెంటరీగా రూపొందించింది.
Lights, Camera, and CLEAN BOWLED!! Witness a bond forged in history- and victory!! 🏏🔥
Greatest Rivalry is coming soon, only on Netflix!#GreatestRivalry #GreatestRivalryOnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/Ezow2j21C2— Netflix India (@NetflixIndia) February 29, 2024
ఫిబ్రవరి 1 శుక్రవారం ‘గ్రేటెస్ట్ రైవర్లీ'(Greatest Rivalry) పేరుతో చిత్రీకరించిన డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ‘లైట్స్, కెమెరా, క్లీన్ బౌల్డ్. చరిత్రలో భాగమైన, గ్రేటెస్ట్ రైవర్లీ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలోనే రాబోతోంది’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది.