Chiyaan 62 | విక్రమ్ Chiyaan 62 క్రేజీ అప్డేట్.. ఇంతకీ ఆ కొత్త యాక్టర్ ఎవరో..?
Chiyaan 62 | కోలీవుడ్ స్టార్ హీరో ఛియాన్ విక్రమ్ (Vikram) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. విక్రమ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. విక్రమ్ నయా సినిమా Chiyaan 62 కీ అప్డేట్ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాబోతుందని మేకర్స్ తెలియజేశారు.
Chiyaan 62 | కోలీవుడ్ స్టార్ హీరో ఛియాన్ విక్రమ్ (Vikram)కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ క్రేజీ యాక్టర్ చేతిలో వరుస సినిమాలున్నాయి. ఇప్పటికే తంగలాన్ (Thangalaan), ధ్రువ నక్షత్రం సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. తాజాగా విక్రమ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. విక్రమ్ నయా సినిమా Chiyaan 62 కీ అప్డేట్ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాబోతుందని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అప్డేట్ వచ్చింది.
తాజా టాక్ ప్రకారం ఈ మూవీలో మలయాళ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ జాయిన్ కాబోతున్నాడని తెలుస్తోండగా.. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుందట. చిన్నా ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు మెరువనున్నారని వార్తలు వస్తుండగా.. ఇంతకీ వారెవరెవరనేది త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న తంగలాన్ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
తంగలాన్ గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తున్నాయి. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అంటూవిక్రమ్ తన సైన్యంతో సమరాన్ని వెళ్తున్నట్టు ఉన్న కొత్త లుక్ గూస్బంప్స్ తెప్సిస్తోంది. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.. పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. తంగలాన్ నుంచి ఇప్పటికే మాళవికా మోహనన్ లుక్ విడుదల చేయగా.. డీగ్లామరైజ్డ్గా కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటిదాకా గ్లామరస్ పాత్రలకే పరిమితమైన ఈ భామ తంగలాన్‌లో ఇదివరకెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నట్టు స్టన్నింగ్ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ పా రంజిత్.
Get ready at 6:00PM for our important actor reveal !!
Could be against all your choices and guesses
Stay tuned !!
@chiyaan #Chiyaan62 @iam_SJSuryah #SUArunKumar @gvprakash @hr_pictures @riyashibu_ @shibuthameens @propratheesh @nareshdudani @sooriaruna @proyuvraaj pic.twitter.com/4gPcYZ9fZx
— HR Pictures (@hr_pictures) March 3, 2024
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/ofPtluhoC7
— Studio Green (@StudioGreen2) October 27, 2023
A fiery story of a bygone era that’s waiting to be told & cherished
#Thangalaan teaser dropping on 1st November
&#Thangalaan arriving at cinemas worldwide on 26th January, 2024@Thangalaan @beemji @kegvraja @StudioGreen2 @officialneelam @parvatweets @MalavikaM_… pic.twitter.com/CprbavpGkV
— Vikram (@chiyaan) October 27, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
డానియల్‌తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

