IPL 2024 | సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా మాజీ ఆల్‌రౌండర్..?
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 19 రోజుల్లో టోర్నీ షురూ కానుంది. ఈ నేపథ్యంలో మాజా చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) కోచింగ్ సిబ్బందిలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్...
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 19 రోజుల్లో టోర్నీ షురూ కానుంది. ఈ నేపథ్యంలో మాజా చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్(SunRisers Hyderabad) కోచింగ్ సిబ్బందిలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బౌలింగ్ కోచ్‌గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) బాధ్యతల నుంచి వైదొలిగాడు. దాంతో, స్టెయిన్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్(James Franklin)ను బౌలింగ్ కోచ్‌గా నియమించే చాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హెడ్‌కోచ్‌గా ఉన్న డానియల్ వెటోరి(Daniel Vettori) ఫ్రాంక్లిన్ పేరును సూచించినట్టు సమాచారం. అయితే.. ఎస్ఆర్హెచ్ యాజయాన్యం ఇంకా అతడి పేరు ఖారారు చేయలేదు. ఈ కివీ మాజీ ఆల్‌రౌండర్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉంది. అతడు 2011, 2012 సీజన్లలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఫ్రాంక్లిన్ 108.43 స్ట్రయిక్ రేటుతో 327 పరుగులు సాధించి.. 9.02 ఎకానమీతో 9 వికెట్లు పడగొట్టాడు.
James Franklin will replace Dale Steyn as the bowling coach of SRH pic.twitter.com/MQ8My0gspc
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) March 2, 2024
హండ్రెడ్ లీగ్‌లో కోచ్‌లుగా..
వెటోరి, ఫ్రాంక్లిన్లకు కోచ్‌లుగా అనుభవం ఉంది. ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్(HLE)లో ఇద్దరూ కోచ్‌లుగా పనిచేశారు. మిడిల్స్ఎక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్ జట్లకు వెటోరి, ఫ్రాంక్లిన్‌లు కోచ్‌లుగా సేవలందించారు. ఆ తర్వాత ఫ్రాంక్లిన్.. డుర్హమ్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. అంతేకాదు పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గానూ ఫ్రాంక్లిన్ సేవలందించాడు. దాంతో, అతడు స్టెయిన్ స్థానాన్ని భర్తీ చేస్తాడని హైదరాబాద్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
డానియల్ వెటోరి

ఐపీఎల్ 16వ సీజన్లో హైదరాబాద్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, ఆగ్రహించిన మేనేజ్మెంట్ కోచ్ బ్రియాన్ లారాను తప్పించి.. డేనియల్ వెటోరీని కోచ్‌గా నియమించింది. అంతేకాదు ఈసారి కెప్టెన్‌ను కూడా మార్చే అవకాశం ఉంది. మినీ వేలంలో భారీ ధర పలికిన ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్(Pat Cummins)కు పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Sunrisers Hyderabad to appoint Pat Cummins as captain for IPL 2024
📸:-ICC #ipl #ipl2024 #patcummins #srh #sunrisershyderabad #orangearmy pic.twitter.com/UKWDwnfn9Y
— SportsTiger (@The_SportsTiger) March 2, 2024
ఈ వారంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కమిన్స్‌ను సారథిగా ప్రకటించనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23వ తేదీన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో తలపడనుంది.
ఇవి కూడా చదవండి
- Family Star | విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్ టైం ఫిక్స్..!
- Naatu Naatu | నాటు నాటు సాంగ్‌కు ఖాన్ త్రయం డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
- WhatsApp | స్నేహసంతసానికి సాంకేతిక సంతకం వాట్సాప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

