WhatsApp | స్నేహసంతసానికి సాంకేతిక సంతకం వాట్సాప్
గడికోసారి ఫోన్ అందుకున్నా... అలా ఫోన్ అందుకున్న ప్రతిసారీ ముఖ కవళికల్లో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకున్నా.. ఆ వచ్చింది వాట్సాప్ సందేశమని అంచనాకు రావొచ్చు. పరిగడపున పచ్చిగంగైనా ముట్టకముందే ‘గుడ్ మార్నింగ్' మెసేజ్‌తో మొదలయ్యే వాట్సాప్ చాటింగ్ జర్నీ.. లేట్‌నైట్ ‘గుడ్‌నైట్' మేసేజ్‌తో గానీ పూర్తవ్వదు.
WhatsApp | గడికోసారి ఫోన్ అందుకున్నా… అలా ఫోన్ అందుకున్న ప్రతిసారీ ముఖ కవళికల్లో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకున్నా.. ఆ వచ్చింది వాట్సాప్ సందేశమని అంచనాకు రావొచ్చు. పరిగడపున పచ్చిగంగైనా ముట్టకముందే ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్‌తో మొదలయ్యే వాట్సాప్ చాటింగ్ జర్నీ.. లేట్‌నైట్ ‘గుడ్‌నైట్’ మేసేజ్‌తో గానీ పూర్తవ్వదు. ఈ తరం మనిషితో వాట్సాప్ అంతగా మమేకమైంది. మనసు నొచ్చుకుంటే ఓ స్టేటస్, ఎవరైనా మెచ్చుకుంటే మరో స్టేటస్.. ఇలా మనిషి జీవితానికి వాట్సాప్ అద్దం పడుతున్నది. ఈ సందేశాల పరంపరలో చేసే చిన్న తప్పిదం.. సందేహాల వలయంలో పడదోస్తుంది. అలా కావొద్దంటే ఈ విషయాలు తెలుసుకోండి..
స్నేహసంతసానికి సాంకేతిక సంతకం వాట్సాప్. భావోద్వేగాలను పంచుకునేందుకు ఎమోజీలు, అభిమానాన్ని చాటుకునేలా ఇమేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు పంపే సౌలభ్యం, రికార్డింగ్ గోల లేకుండా వాయిస్ కాల్స్ చేసుకునే వీలు, గ్రూప్‌గా జట్టుకట్టే వెసులుబాటు, గ్రూప్‌గా వీడియోకాల్స్ చేసుకునే సౌకర్యం.. ఇన్ని అవకాశాలకూ ఆలవాలం వాట్సాప్. ఈ సందేశాల పరంపరకు అడ్డుకట్ట వేస్తుంటారు స్కామర్లు.
మోసాలు.. రకరకాలు
వాట్సాప్ యాప్ ఇన్స్టాల్ చేయగానే.. టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ చేయడం తప్పనిసరి. రీ లాగిన్ అయ్యే సందర్భంలోనూ టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అవసరం. ఈ సమయంలో వాట్సాప్ నుంచి వినియోగదారులకు ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అవ్వొచ్చు! వినియోగదారుడు అభ్యర్థించకుండానే వెరిఫికేషన్ కోడ్ వచ్చిందంటే ఎక్కడో తేడా జరిగిందని ఊహించాలి. ఎవరో మీకు తెలియకుండా మీ వాట్సాప్ అకౌంట్‌ను యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుమానించాలి. ఎట్టి పరిస్థితుల్లో మీకు వచ్చే వెరిఫికేషన్ కోడ్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. అనాలోచితంగా ఎవరికైనా పంపితే.. మీ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోండి.
కొందరు ఫ్రాడ్స్టర్లు వాట్సాప్ అకౌంట్ యాక్సెస్ చేయకుండానే వినియోగదారుల వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చే చర్యలకు పాల్పడుతుంటారు. సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఇలా సమాజంలో గౌరవించే స్థానంలో ఉన్న వ్యక్తుల పేర్లు, ప్రొఫైల్ ఫొటోలతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి.. సామాన్యులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. సదరు సందేశాలు ఆయా వ్యక్తులే పంపుతున్నారని భావించి స్పందిస్తే పరిస్థితులు ఎక్కడికైనా దారితీయొచ్చు. ఫేక్ ప్రొఫైల్ అని తెలియక… నిజమైన వ్యక్తులను నిందించే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ ప్రముఖుల వ్యక్తిగత ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది.
వాట్సాప్ గోల్డ్, హయ్యర్ లెవల్, ఫీచర్ రిచ్ వెర్షన్ అనీ నయా వెర్షన్లు అందుబాటులో ఉన్నాయంటూ కొందరు సందేశాలు పంపుతుంటారు. దీనిని ప్రముఖులు ఉపయోగిస్తుంటారనీ, మీరూ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా లింక్‌లు పంపుతుంటారు. వాటిని క్లిక్ చేయడం వల్ల మీ ఫోన్లోకి మాల్వేర్ చొరబడే ప్రమాదం ఉంది. ఇలాంటి అప్డేటెడ్ వెర్షన్లు ఉన్నాయని ఎవరైనా సందేశం పంపితే ఆ నంబర్లను బ్లాక్ చేయడం ఒక్కటే మార్గం.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలు, సూపర్మార్కెట్ల నుంచి ఆఫర్ వచ్చిందని కొందరు మెసేజ్‌లు పంపుతుంటారు. కూపన్ రాగానే పంపింది ఎవరో చూడకుండా లింకులు క్లిక్ చేశామో.. అసలుకే ఎసరొస్తుంది.
రొమాన్స్ స్కామ్‌లకు వాట్సాప్ వేదికగా నిలుస్తున్నది. అందమైన యువతి వాట్సాప్‌లో హలో! అని మెసేజ్ పెట్టగానే.. పరిచయం లేని వ్యక్తితో మనకెందుకు అనుకోకపోయారో భారీ మూల్యం చెల్లించకతప్పదు. ‘హాయ్!’తో మొదలయ్యే ఈ సందేశాల పరంపర ఒకరోజు అతివ వలలో చిక్కే వరకు వెళ్తుంది. అవతలి వ్యక్తి ఒక్కో వలువ తీసే కొద్దీ.. ఇవతలి వ్యక్తీ విలువలు కోల్పోయి అదే పని చేస్తూ పొంగిపోతాడు.
కాల్ అయిపోయాక.. ఇందాకటి వీడియో కాల్ రికార్డు చేశామనీ, తాము అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే మీ బండారం బయటపెడతామని బెదిరిస్తారు. వాటికి ఒక్కసారి లొంగిపోయామా… ఖాతా ఖాళీ అయ్యే వరకు వేధింపులు కొనసాగుతూనే ఉంటాయి. పరిచయం లేని వ్యక్తి అతి చనువుగా, అనుచితంగా మెసేజ్‌లు చేస్తే.. వెంటనే బ్లాక్ చేయడం శ్రేయస్కరం.
ఇలా వాట్సాప్ వారధిగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ వినియోగదారులను చిక్కుల్లో పడేస్తున్నారు. వాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండటం మన విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది.
సేఫ్టీ ఇలా..
- రిజిస్ట్రేషన్ కోడ్, టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. టూ-స్టెప్ వెరిఫికేషన్
ఎనేబుల్ చేయండి. పిన్ కోడ్ మర్చిపోయినట్లయితే ఇ-మెయిల్ ద్వారా పిన్ పొందే అవకాశం ఉంటుంది. - ప్రైవసీ సెటప్‌లో లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫొటో, స్టేటస్ వంటివి మీ కాంటాక్ట్స్‌కు మాత్రమే కనిపించేలా
సెట్ చేసుకోండి. ‘ఎవ్రీవన్’కు బదులు ‘మై కాంటాక్ట్స్’ ఉండేలా చూసుకోండి.
డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఉపయోగించినట్లయితే..
- మీ పని పూర్తయ్యాక లాగ్ అవుట్ అవ్వడం మర్చిపోకండి.
- వాట్సాప్ చాట్‌ను రెగ్యులర్‌గా బ్యాకప్ చేయడం మంచిది.
- తెలియని నంబర్ల నుంచి సందేశాలు వస్తే.. ముందుగా వాళ్లు ఎవరో తెలుసుకున్న తర్వాతే.. స్పందించాలని గుర్తుపెట్టుకోండి.
గుర్తుంచుకోండి..
- ఎవరైనా అభ్యంతరకరమైన సందేశాలు పంపినట్లయితే https://faq.whatsapp.com/2798237480402991/ లింక్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు.
- ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే https://www.cybercrime.gov.in/ వెబ్‌లింక్ ద్వారా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు. 1930 నంబర్ ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

