Gautam Gambhir | ధోని సక్సెస్ఫుల్ కెప్టెన్.. ప్రశంసలు కురిపించిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir | ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుబోతున్నది. చెన్నై వేదికగా వేదికగా జరుగనుండగా.. సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు.
Gautam Gambhir | ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుబోతున్నది. చెన్నై వేదికగా వేదికగా జరుగనుండగా.. సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ క్రికెట్లో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ధోనీ ఒకడని.. అతని సారథ్యంలో భారత్ మూడుసార్లు ఐసీసీ టైటిల్స్ సాధించిందని తెలిపాడు.
2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ సారథ్యంలోనే నెగ్గినట్లు గౌతి ప్రశంసించాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి మిస్టర్ కూల్.. ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.
గత సీజన్ వరకు కెప్టెన్గా కొనసాగిన ధోనీ ఈ సీజన్ ప్రారంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతనిస్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు కెప్టెన్గా యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్లో 226 మ్యాచ్లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించగా.. జట్టు 133 విజయాలను నమోదు చేసింది. ఇక చెన్నై – కోల్కతా మ్యాచ్కు ముందు ధోనీ కెపెన్సీపై గంభీర్ మాట్లాడుతూ.. భారత్కు విజయవంతమైన కెప్టెన్ అని.. ఎవరూ ధోనీ స్థాయికి ఎవరూ చేరుకోగలరని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫినిష్ చేయడంలో ధోనీ నైపుణ్యాన్ని సైతం గంభీర్ ప్రశంసించాడు. ఇదిలా ఉండగా.. కేకేఆర్ జట్టు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో జోరుమీదున్నది. ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండు స్థానాలో కొనసాగుతున్నది. ఇక చెన్నై జట్టు నాలుగు మ్యాచుల్లో రెండింట్లో నెగ్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

