అమ్మాయిలకు తొలి ఓటమి
మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. మెగా టోర్నీలో అమ్మాయిల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. తొలి రౌండ్‌ను అజేయంగా ముగించిన భారత్.. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ పూల్-ఈతొలి మ్యాచ్‌లో 0-2 తేడాతో వరల్డ్ నం.1 నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది.
- 0-2తో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం.. నేడు డచ్ జట్టుతోనే అబ్బాయిల పోరు
ఆమ్స్టెల్వీన్: మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. మెగా టోర్నీలో అమ్మాయిల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. తొలి రౌండ్‌ను అజేయంగా ముగించిన భారత్.. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ పూల్-ఈతొలి మ్యాచ్‌లో 0-2 తేడాతో వరల్డ్ నం.1 నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. ఆట ఆరంభం నుంచే భీకరమైన ఎదురుదాడి వ్యూహంతో ఒత్తిడి పెంచిన డచ్ జట్టు రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచి విజయం సాధించింది. 2వ నిమిషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను యిబి జాన్సన్ పవర్ఫుల్ డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచి నెదర్లాండ్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించగా, 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఫ్రెడరిక్ మట్ల గోల్‌గా మలచడంతో డచ్ టీమ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మరోవైపు భారత అమ్మాయిలు గోల్ అవకాశాలను సృష్టించుకోవడంలో పెద్దగా విజయం సాధించలేకపోయారు. వచ్చిన అవకాశాలను ఫార్వర్డ్ లైన్ గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. నవ్‌నీత్ కౌర్ కొట్టిన పవర్ఫుల్ షాట్ డచ్ గోల్‌కీపర్ హెల్మెట్‌కు తగిలి బయటకు వెళ్లగా, సునెలితా తోప్పో కౌంటర్ ఎటాక్ షాట్‌ను ప్రత్యర్థి కీపర్ సులువుగా అడ్డుకుంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలి యాపై గెలిస్తేనే అమ్మాయిలు సెమీస్ చేరుతారు. కాగా, శనివారం జరిగే రెండో రౌండ్ తొలి పోరులో భారత పురుషుల జట్టు.. నెదర్లాండ్స్తోనే పోటీ పడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

