IND vs SA : టెస్టు, వన్డే సిరీస్‌లో చెరొకటి గెలుచుకున్న భారత్, దక్షిణాఫ్రికా టీ20 పోరుకు సిద్ధమయ్యాయి. కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మైదానంలో టీమిండియాను రెండుసార్లు ఓడించిన ప్రొటీస్ టీమ్.. హ్యాట్రిక్ కొట్టాలనుకుంటోంది. అయితే.. ఇటీవల వరుస విజయాలతో సిరీస్‌లు పట్టేస్తున్న భారత్.. 6-0తో ఉన్న రికార్డును కొనసాగించాలనుకుంటోంది.
తొలి టీ20లో ఊహించినట్టుగానే టీమిండియా తుదిజట్టులో సంజూ శాంసన్ (Sanju Samson)కు చోటు దక్కలేదు. అతడి బదులు జితేశ్ శర్మ (Jitesh Sharma) వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. స్పిన్నర్‌గా కుల్దీప్ స్థానంలో వరుణ్ జట్టులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా రాకతో బ్యాటింగ్, బౌలింగ్ దళం పటిష్టంగా మారింది.
Presenting #TeamIndia‘s Playing XI for the 1⃣st T20I 🙌
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/Dtr31OTdE3
— BCCI (@BCCI) December 9, 2025
భారత తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఎడెన్ మర్క్రమ్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనొవాన్ ఫెరీరా, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, లుతో సిపమ్లా, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జి.
సఫారీల విషయానికొస్తే వన్డే సిరీస్‌కు దూరమైన స్టబ్స్, డేవిడ్ మిల్లర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. యువ పేసర్ సిప్లమాతో పాటు అన్రిజ్ నోర్జిలు ఆడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న టీమిండియా..ఇటీవలే ఆవిష్కరించిన కొత్త జెర్సీతో ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడుతోంది.
🚨 Toss 🚨#TeamIndia have been put into bat first.
Updates ▶️ https://t.co/tiemfwcNPh #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ZCl53IqrWK
— BCCI (@BCCI) December 9, 2025