ఓవల్: అంతర్జాతీయ మ్యాచుల్లో టీమిండియా వరుసగా 15వ సారి టాస్(India Toss) ఓడింది. ఇవాళ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభమైన అయిదో టెస్టులోనూ శుభమన్ గిల్ టాస్ ఓడిపోయాడు. ఈ సిరీస్‌లో అయిదు మ్యాచుల్లోనూ అతను టాస్‌ను కోల్పోయాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా ఇండియా 15 టాస్‌లను ఓడింది. క్రికెట్ చరిత్రలో ఇదో కొత్త రికార్డు. ఓ జట్టు వరుసగా అన్ని సార్లు టాస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. 32,768 సార్లకు ఒకసారి ఇలా జరిగినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. అంటే 0.003 శాతం ఇలా జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన గిల్.. ఇంగ్లండ్ సిరీస్‌లో వరుసగా అయిదు టెస్టుల్లో టాస్ ఓడాడు. అంతకముందు అంతర్జాతీయ మ్యాచుల్లో ఇండియా రెండు టీ20, 8 వన్డేల్లోనూ టాస్‌ను కోల్పోయింది. అయితే 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ జట్టు అన్నింటిలో టాస్‌ను కోల్పోవడం ఇది 14వసారి. 2018లో ఇంగ్లండ్‌లో టూర్ చేసిన ఇండియా అన్ని మ్యాచుల్లో టాస్ ఓడింది.
ఇవాళ ఓవల్‌లో ప్రారంభమైన టెస్టులో తాజా సమాచారం ప్రకారం ఇండియా 17 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 44 రన్స్ చేసింది.