డంబుల్లా: ముక్కోణపు వన్డే టోర్నీలో ఇండియా-ఏతో ఇవాళ జరిగిన రసవత్తర మ్యాచ్(India A Vs Srilanka A)లో శ్రీలంక-ఏ జట్టు సూపర్ ఓవర్లో విక్టరీ కొట్టింది. తొలుత ఇద్దరి మధ్య మ్యాచ్ టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్ ఆడారు. సూపర్ ఓవర్లో శ్రీలంక విధించిన లక్ష్యాన్ని భారత్ అందుకోలేకపోయింది. సూపర్ ఓవర్లో ఏడు రన్స్ తేడాతో ఇండియా ఓడింది. తొలి మూడు బంతులను షెడ్జ్ ఆడగా, చివరి మూడు బంతులను సూర్యవంశీ ఆడారు. కానీ అతను కేవలం 5 రన్స్ మాత్రమే చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక ప్లేయర్లు, సూర్యవంశీ మధ్య వాగ్వాదం జరిగింది. సూర్యవంశీ, లంక ప్లేయర్లు ఒకర్ని ఒకరు తోసుకున్నారు. ఓ లంక ప్లేయర్ ఆ గొడవను ఆపాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 49.2 ఓవర్లలో 265 రన్స్ చేసి ఆలౌటైంది. అయితే చేజింగ్లో తగ్గాఫార్ నడిచింది. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడాయి. నిర్ణీత 50 ఓవర్లో శ్రీలంక ఏ జట్టు 9 వికెట్లు కోల్పోయి 265 రన్స్ చేసింది. ఆఖరి బంతికి రెండు రన్స్ అవసరం కాగా, చమిక గుణశేఖర రనౌట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయ్యింది. మ్యాచ్ టై కావడంతో.. శ్రీలంక, భారత కెప్టెన్లు సూపర్ ఓవర్ ఆడేందుకు సముఖత వ్యక్తం చేశారు.
కాసేపు మైదానంలోనే అంపైర్లతో చర్చ జరిగింది. అప్పటికే లైట్ డిమ్ కావడం వల్ల సూపర్ ఓవర్ జరుగుతుందో లేదో టెన్షన్ ఉండే. కానీ సూపర్ ఓవర్లో ఫస్ట్ శ్రీలంక బ్యాటింగ్ చేసింది. భారత పేసర్ అర్షద్ ఖాన్ ఆ ఓవర్ వేశాడు. ఆ సూపర్ ఓవర్లో శ్రీలంక వికెట్ నష్టపోకుండా 16 రన్స్ స్కోరు చేసింది. 17 రన్స్ టార్గెట్తో సూపర్ ఓవర్లో బరిలోకి దిగిన భారత్.. కేవలం 10 రన్స్ మాత్రమే చేసింది. దీంతో శ్రీలంక ఏ జట్టును విజయం వరించింది.
ఇండియన్ ఇన్నింగ్స్లో సూర్యవంశీ 21, రుతురాజ్ 37, సూర్యాంశ్ షెడ్జ్ 72, విప్రాజ్ నిఘమ్ 51 రన్స్ చేశారు. చేజింగ్లో లంక బ్యాటర్ సమరవిక్రమ అద్భుత బ్యాటింగ్ చేశాడు. అతను కీలకమైన 93 రన్స్ చేశాడు. లంక బ్యాటర్లలో డిక్వెల్ల 37, ఫెర్నాండో 22, వనుస సహాన్ 25 రన్స్ చేశారు. అయితే థ్రిల్లింగ్గా సాగిన మ్యాచ్లో చివరకు ఎందుకు ఘర్షణ జరిగిందో ఇంకా స్పష్టంగా తెలియదు. సూర్యవంశీ, షెడ్జ్ జోడిని సూపర్ ఓవర్లో విజయవంతంగా లంక బౌలర్లు అడ్డుకోగలిగారు.
Vaibhav Sooryavanshi Fight With Srilanka Team 🔥😡#INDAvSRIA #VaibhavSooryavanshi pic.twitter.com/FwMI5GuVaP
— V A R D H A N (@ImHvardhan21) June 15, 2026