Guwahati Test : గువాహటి టెస్టులో సమిష్టి వైఫల్యంతో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకునేలా ఉంది. విజయంపై ఆశలు ఆవిరైన వేళ.. కనీసం డ్రా కూడా అసాధ్యం అనిపిస్తోంది. మన బ్యాటర్లు కుప్పకూలిన చోట.. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ చేసి మ్యాచ్‌పై పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాధ్యతగా ఆడాల్సిన ఓపెనర్లు 21 పరుగులకే పెవిలియన్ చేరారు. దాంతో.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా27 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 522 పరుగులు కావాలి. ఎనిమిది వికెట్లు ఉన్నా.. సిరీస్ సమం చేయాలంటే సఫారీ బౌలర్లను కాచుకొని రోజంతా నిలబడడం గగనమే.
సిరీస్‌లో వెనకబడిన భారత జట్టు గువాహటిలోనూ అదే తడబాటు కొనసాగిస్తోంది. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాల్ని సృష్టించుకోలేకపోయింది. నాలుగో రోజు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు కళ్లెం వేయలేక భారీ స్కోర్ సమర్పించుకుంది. సఫారీ టీమ్ రెండో ఇన్నింగ్స్‌ను 260/5 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 549 లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు మార్కో జాన్సెన్ షాకిస్తూ.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(13)ను పెవిలియన్ పంపాడు.
Stumps on Day 4⃣
See you tomorrow for Day 5️⃣ action.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/MXqtMGMhay
— BCCI (@BCCI) November 25, 2025
కాసేపటికే నాలుగు పరుగుల తేడాతో కేఎల్ రాహుల్(6)ను హార్మర్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం.. నైట్‌వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(4 నాటౌట్).. సాయి సుదర్శన్ (2 నాటౌట్) వికెట్ కాచుకున్నారు. దాంతో, నాలుగో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి ౨27 పరుగులు చేసింది. సిరీస్ సమం చేయాలంటే ఐదో రోజు మిడిలార్డర్ బ్యాటర్లు గొప్పగా పోరాడాల్సి ఉంది. అలా కాదని మళ్లీ చేతులెత్తేశారంటే సఫారీ జట్టు క్లీన్‌స్వీప్ చేయడం పక్కా.
తొలి రెండు రోజు నుంచి ఆధిపత్యం చెలాయించిన దక్షిణాఫ్రికా గువాహటి టెస్టులో డ్రైవింగ్ సీట్లో ఉంది. రోడ్డులాంటి ట్రాక్ మీద భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో ట్రిస్టన్ స్టబ్స్(94), టోనీ డీజోర్జి(49)లు సఫారీలకు భారీ ఆధిక్యం అందించారు. మార్కో జాన్సెన్(6-48) చెలరేగడంతో టీమిండియాను 201కే ఆలౌట్ చేసిన.. పర్యాటక జట్టు నాలుగో రోజూ అదరగొట్టింది. ఓవర్ నైట్ స్కోర్‌తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ఓపెనర్లను తొలి సెషన్లోనే రవీంద్ర జడేజా ఔట్ చేసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ తెంబా బవుమా(3)ను సుందర్ వెనక్కి పంపాడు. దాంతో.. ప్రత్యర్థిని రెండో సెషన్‌లోపే చుట్టేస్తారనిపించింది.
Innings Break!
South Africa have declared their innings on 260/5.#TeamIndia need 549 runs to win.
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/QCV3zea51c
— BCCI (@BCCI) November 25, 2025
కానీ.. ట్రిస్టన్ స్టబ్స్(94), డిజోర్జి(49)లు క్రీజులో పతనాన్ని అడ్డుకొని స్కోర్‌బోర్డును ఉరికించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యంతో సఫారీల ఆధిక్యాన్ని 450 దాటించారు. రెండో సెషన్ తర్వాత దూకుడు పెంచిన స్టబ్స్ సెంచరీ కోసం యత్నించి జడ్డూ ఓవర్లో బౌల్డయ్యాడు. 260 వద్ద అతడి వికెట్ పడిన వెంటనే బవుమా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.