లార్డ్స్ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టు(Lords Test)లో.. ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాదాపు మ్యాచ్‌ను చేజార్చుకునే స్థితికి చేరుకున్నది. ఇవాళ ఉదయం 58 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ సేన.. ఇప్పటి వరకు తొలి సెషన్లోనే మూడు కీలకమైన వికెట్లను కోల్పోయింది. పంత్, రాహుల్, సుందర్ ఔటయ్యారు. దీంతో ఇండియా 193 పరుగుల స్వల్ప టార్గెట్‌ను చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇండియా ఇంకా గెలుపు కోసం 110 రన్స్ చేయాల్సి ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు, స్టోక్స్ రెండు వికెట్లు తీసుకున్నారు. పంత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఆర్చర్.. ఆ తర్వాత సుందర్‌ను అద్భుతమైన రీతిలో కాటన్బోల్డ్ చేశాడు. లార్డ్స్ టెస్టులో ఇవాళే ఆఖరి రోజు. క్రీజ్‌లో నితీశ్ రెడ్డి, జడేజా ఉన్నారు.