మెల్బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత్‌లో (Team India) కష్టాల్లో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా 33 రన్స్‌కే 3 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఆచితూటి ఆడుతున్న 17వ ఓవర్లో పాట్ కమిన్స్ షాకిచ్చాడు. 9 రన్స్‌తో నిలకడగా ఆడుతున్న హిట్‌మ్యాన్ రోహిత్‌ను కమిన్స్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. కమిన్స్ ధాటికి 17వ ఓవర్లోనే క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 25 రన్స్‌కే భారత్ 2 వికెట్లు కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ కూడా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడుతున్న కోహ్లీ స్లిప్‌లో దొరికిపోయాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ ఫస్ట్ బాల్కే మిచెల్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 29 బాల్స్ ఆడి 5 రన్స్‌కే ఔటై జట్టును కష్టాల్లోకి నెట్టాడు. లంచ్ బ్రేక్ సమయానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేసింది. నాలుగో టెస్టులో గెలవాలంటే భారత్ మరో 307 రన్స్ చేయాల్సి ఉంది. చేతిలో మరో ఏడు వికెట్లు ఉన్నాయి.
A first session to forget for India on day 5 😐 pic.twitter.com/m8oFiNApTp
— ESPNcricinfo (@ESPNcricinfo) December 30, 2024