Commonwealth Games | ఢిల్లీ: 2036లో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత్.. అంతకంటే ముందే మరో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులనూ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. 2030లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణ పట్ల భారత్ ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ తెలిపేందుకు గాను ఈ ఏడాది మార్చి 31 దాకా గడువుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రక్రియకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఒకవేళ ‘కామన్వెల్త్’ హక్కులను దక్కించుకుంటే.. గ్లాస్గోలో తొలిగించిన పది క్రీడాంశాలను 2030లో ఆడించే అవకాశముంది.