చెస్టర్ లీ స్ట్రీట్: ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. కామన్వెల్త్ సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి.. తుదిపోరులో ఆసీస్ చేతిలో తృటిలో పరాజయం పాలైన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం.. శనివారం జరుగనున్న పోరులో నెగ్గి బోణీ కొట్టాలని తహతహలాడుతున్నది. స్మృతి మందన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు హార్డ్ హిట్టర్ కిరణ్ నవగిరె రాణిస్తే.. టీమ్ఇండియాకు తిరుగుండదు. వచ్చే ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మంచి ప్రదర్శన చేశాం. ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. తుది జట్టులో ఆరుగురు బ్యాటర్లు ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం’ అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పేర్కొంది.