Hockey | జోహర్ బహ్రు(మలేషియా): ప్రతిష్ఠాత్మక సుల్తాన్ జోహర్ కప్‌లో భారత జూనియర్ హాకీ జట్టు వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో యువ భారత్ 6-4 తేడాతో గ్రేట్బ్రిటన్పై అద్భుత విజయం సాధించింది. ఇరు జట్లు ఆది నుంచే తమదైన దూకుడు కొనసాగించారు.
భారత్ తరఫున దిల్రాజ్సింగ్(17ని, 50ని), శార్దనంద్తివారీ(20ని, 50ని) రెండేసి గోల్స్ చేయగా, కొనైన్ దాద్(7ని), మన్మీత్సింగ్(26ని) ఒక్కో గోల్ నమోదు చేశారు. రోరీ పెన్రోజ్(2ని, 15ని), మిచెల్ రోడెన్(46ని, 59ని) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకున్నారు. మ్యాచ్ మొదలైన రెండో నిమిషానికే బ్రిటన్ గోల్ ఖాతా తెరువగా, ఆ తర్వాత పుంజుకున్న భారత్ పోటీలోకి వచ్చింది.