న్యూఢిల్లీ: ఒలింపిక్ పతక విజేత, ఒకప్పటి స్టార్ హాకీ ఆటగాడు వరిందర్ సింగ్ (75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్‌లో మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన వరిందర్ సింగ్.. 1975లో భారత జట్టు హాకీ ప్రపంచకప్ విజేతగా నిలువడంలో కీలక పాత్ర పోషించారు. హాకీకి వరిందర్ చేసిన సేవలకు గాను మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. వరిందర్ సింగ్ మృతిపై హాకీ ఇండియా (హెచ్ఐ) సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.