న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల రెండో రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కామన్వెల్త్ పతక విజేత జాస్మిన్ లాంబొరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు) తమ బౌట్లలో విజయాలు సాధించి ముందడుగు వేయగా.. శృతి యాదవ్ (70 కేజీలు) పరాజయం పాలైంది.
60 కేజీల పోరులో టాంజానియాకు చెందిన బెట్రిక్ అంబ్రోస్‌పై జాస్మిన్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. జాస్మిన్ పంచ్‌లకు ప్రత్యర్థి నిలువలేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే రిఫరీ భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. మరో బౌట్లో సాక్షి చోప్రా 5-0తో కెన్యా బాక్సర్‌పై ఏకపక్ష విజయం సాధించింది. శృతి తొలి రౌండ్లో 0-5తో చైనా బాక్సర్ చేతిలో ఓడింది.