మా జట్టుకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్, కరాచీలో అభిమానులు ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో.. హైదరాబాద్ లో కూడా అచ్చం అలాగే కనిపించింది.
ఏ మ్యాచ్ లోనైనా సెంచరీకి ఉండే క్రేజ్ ఒకటే. నా ప్రదర్శనతో సంతోషంగా ఉన్నా. బాబర్, నేను స్ట్రయిక్ రొటేట్ చేసేందుకు ఎక్కువ ప్రయత్నిస్తాం. అందుకే మా మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది. షకీల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మెగాటోర్నీలోనూ ఇలాగే సత్తా చాటుతాడని ఆశిస్తున్నా.
-మహమ్మద్ రిజ్వాన్