కొడతారా తీన్మార్.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ మూడో టీ20
న్యూజిలాండ్ టూర్లో వరుసగా రెండు అద్భుత విజయాలతో ఖతర్నాక్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సిరీస్‌పై గురి పెట్టింది. మంగళవారం జరిగే మూడో పోరులోనూ గెలిచి సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది.
- సిరీస్‌పై గురి పెట్టిన అయ్యర్ సేన
- భువనేశ్వర్ కుమార్‌పై ఫోకస్
- మధ్యాహ్నం 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ టూర్లో వరుసగా రెండు అద్భుత విజయాలతో ఖతర్నాక్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సిరీస్‌పై గురి పెట్టింది. మంగళవారం జరిగే మూడో పోరులోనూ గెలిచి సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. 2020లో విరాట్ కోహ్లీ సారథ్యంలో న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఆ తర్వాత 2022-23 పర్యటనలోనూ అజేయంగా నిలిచింది. ఇప్పుడు పేస్ లీడర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోయినా తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు అదే రికార్డును కొనసాగించాలని చూస్తోంది. అయితే, వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో వీచే తీవ్రమైన ఈదురు గాలులు, చల్లటి వాతావరణం భారత క్రికెటర్లకు ప్రధాన పరీక్షగా మారనున్నాయి.
భువీ మెప్పించేనా..
నాలుగేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ బౌలింగ్‌పై ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఉండనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ నాలుగేసి ఓవర్ల కోటా పూర్తి చేసిన అతను వరుసగా 49, 50 పరుగులు సమర్పించుకొని నిరాశపరిచాడు. అయినా టీమ్ మేనేజ్మెంట్పై భువీపై నమ్మకం ఉంచింది. వెల్లింగ్టన్ మైదానంలో వీచే క్రాస్-విండ్స్ భువీ స్వింగ్‌కు బాగా అనుకూలిస్తాయని, ఈ వాతావరణంలో అతడు లయ అందుకుంటాడని ఆశిస్తోంది. మరోవైపు, కుడిచేతి వాటం బ్యాటర్లను తన స్వింగ్, యార్కర్లతో ఇబ్బందిపెట్టే అర్ష్దీప్పైనా ఈ మ్యాచ్‌లో అంచనాలున్నాయి. అయితే, చలిగాలులను, స్వింగ్‌ను ఎదుర్కొంటూ స్ట్రెయిట్ షాట్లు ఆడటం భారత బ్యాటర్లకు సవాల్ కానుంది. ఇషాన్ కిషన్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. దాంతో, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీకి మరో చాన్స్ ఖాయమే. గత పోరులో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్న బీహార్ బుడ్డోడికి ఈ పోరుకు కీలకం కానుంది. మిడిల్ ఆర్డర్ త్రయంతిలక్ , నమన్ ధీర్, నితీశ్ రెడ్డి తొలి రెండు మ్యాచ్‌ల్లో వీరోచిత పోరాటంతో మ్యాచ్‌లను గెలిపించింది.అయితే, ఓపెనర్లు అభిషేక్, శాంసన్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా హెడ్ కోచ్ గంభీర్ మంచి ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నాడు. ప్రత్యర్థి స్పిన్నర్లు సత్తా చాటుతున్న సిరీస్‌లో అక్షర్ పటేల్ బంతితో మెప్పించాల్సిన అవసరం ఉంది.
కివీస్ డీలా..
సిరీస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతోంది. రాబోయే వన్డే, టెస్టు సిరీస్ కోసం వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రధాన పేసర్ మాట్ హెన్రీకి మిగతా సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించగా.. లోకీ ఫెర్గూసన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ ఇద్దరి స్థానంలో ఆడం మిల్నే, జేమీసన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక, గ్లెన్ ఫిలిప్స్ మినహా టాప్ ఆర్డర్ ఫెయిల్ కావడం కూడా న్యూజిలాండ్ యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. ఫిన్ అలెన్, టిమ్ సిఫర్ట్, డారిల్ మిచెల్ ఇంకా సరైన ఫామ్‌లోకి రాకపోవడం ఆ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. స్పిన్నర్లు శాంట్నర్, బ్రేస్‌వెల్ నిలకడగా రాణిస్తుండటం ఆతిథ్య జట్టుకు సానుకూలాంశం. అయితే, స్లాగ్ఓవర్లలో పేసర్లు నిరాశపరుస్తుండటంతో రెండు మ్యాచ్‌ల్లో మంచి స్కోర్లను కాపాడుకోలేకపోయింది. దీనిపై ఆతిథ్య జట్టు మేనేజ్మెంట్ దృష్టిసారించనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్, శాంసన్ (కీపర్), సూర్యవంశీ, శ్రేయస్ (కెప్టెన్), తిలక్, నమన్, నితీశ్, అక్షర్, భువనేశ్వర్, ప్రిన్స్, అర్ష్‌దీప్.
న్యూజిలాండ్: అలెన్, సిఫర్ట్ (కీపర్), జాకబ్స్ / కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), నేథన్ స్మిత్, జేమీసన్, మిల్నే, డఫీ.
పిచ్/వాతావరణం
ఈ మ్యాచ్ కోసం బేసిన్ రిజర్వ్ మైదానంలో కొత్త పిచ్‌ను ఉపయోగిస్తున్నారు. దీనిపై బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టమే కానుంది. తీవ్రమైన ఈదురు గాలులతో పాటు మ్యాచ్‌కు ముందు వర్ష సూచన కూడా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

