Hockey Asia Cup : మహిళల హకీ ఆసియా కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్(Japan)తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో కొరియాపై 1-0తో చైనా విజయం సాధించి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. అయినా సరే నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన సూరజ్ లతా దేవీ నేతృత్వంలోని టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం ఇరుజట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఫైనల్లో గెలుపొందిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరుగబోయే ఎఫ్ఐహెచ్ వరల్డ్ కప్ (FIH World Cup) పోటీలకు అర్హత సాధిస్తుంది.
ఆసియా కప్ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత జట్టు చివరి సూపర్ 4 మ్యాచ్‌లోనూ చెలరేగింది. బలమైన జపాన్ను నిలువరిస్తూ మ్యాచ్ డ్రా చేసుకొని ఫైనల్లో అడుగుపెట్టింది. ఆట మొదలైన 7వ నిమిషంలోనే నేహా గోయల్ (Neha Goel) కొట్టిన గోల్‌ను ప్రత్యర్థి ప్లేయర్ డుంగ్ డుంగ్ నెట్లోపలికి వెళ్లి అడ్డుకుంది. దాంతో.. రిఫరీ టీమిండియాకు గోల్ ప్రకటించాడు.
𝑯𝒐𝒏𝒐𝒖𝒓𝒔 𝒔𝒉𝒂𝒓𝒆𝒅! 🤝
We played out an entertaining 1-1 draw against defending champions Japan in our final Super 4s match of the Women’s Asia Cup Gongshu 2025.#HockeyIndia #IndiaKaGame #WomensAsiaCup2025 pic.twitter.com/idpp7z9xrj
— Hockey India (@TheHockeyIndia) September 13, 2025
రెండో అర్ధ భాగంలో జపాన్ జట్టు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. పెనాల్టీ కార్నర్ లభించినా.. గోల్ కీపర్ సమర్ధంగా అడ్డుకోవడంతో 1-0తో ఆధిక్యంలో నిలిచింది భారత్. మూడో అర్ధ భాగంలో.. షిమో కొబయకవడా బంతిని 58వ నిమిషంలో గోల్ పోస్ట్‌లోకి పంపింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి.