ఢిల్లీ : సుమారు రెండు దశాబ్దాల అనంతరం ఏఎఫ్సీ అండర్-20 ఉమెన్స్ ఆసియా కప్‌లో ఆడుతున్న భారత ఫుట్‌బాల్ జట్టు.. క్వార్టర్స్ రేసులోకి వచ్చింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్-సీలో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లలో జపాన్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత అమ్మాయిలు.. మూడో మ్యాచ్‌లో మాత్రం 3-1తో చైనీస్ తైపీని ఓడించి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.
ఫార్వర్డ్ సివాని దేవి (32వ, 87వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా భూమిక దేవి (26వ ని.) ఒక గోల్ కొట్టింది. 2004 తర్వాత తొలిసారిగా ఈ టోర్నీ ఆడుతున్న భారత జట్టుకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. కాగా భారత్ క్వార్టర్స్ చేరాలంటే గ్రూప్-బీలో గురువారం జోర్డాన్, ఉజ్బెకిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగియాలి. ఈ రెండింటిలో ఏ జట్టు గెలిచినా భారత ఆశలు ఆవిరవుతాయి.