INDW vs SLW : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు పొట్టి కప్‌పై దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో భాగంగానే స్వదేశంలో శ్రీలంకను ఢీ కొడుతోంది. విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) బౌలింగ్ తీసుకుంది. విశ్వవిజేతగా మొదటి సిరీస్ ఆడుతున్న టీమిండియా.. విజయంతో టోర్నీని ఆరంభించాలని భావిస్తోంది. తుదిజట్టులో యువకెరటం వైష్ణవీ శర్మ(Vaishnavi Sharma)కు చోటు దక్కింది. టాస్కు ముందు కెప్టెన్ నుంచి తను డెబ్యూ క్యాప్ స్వీకరించింది.
పొట్టి సిరీస్‌లో శ్రీలంకకు చెక్ పెట్టాలనుకుంటున్న భారత్ పటిష్టమైన బృందంతో బరిలోకి దిగుతోంది. వరల్డ్‌కప్ ఫైనల్లో బ్యాటుతో, బంతితో మ్యాజిక్ చేసిన షఫాలీ వర్మ, తెలుగమ్మాయి శ్రీ చరణి ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) 18 రన్స్ కొడితే ఈ ఫార్మాట్లో 4 వేల క్లబ్లో చేరిన రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనుంది. న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ సుజీ బేట్స్ మొదటగా ఈ మైలురాయికి చేరుకుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఇదే వేదికపై ప్రపంచకప్‌లో రెండు మ్యాచుల్లోనూ ఓడిన హర్మన్‌ప్రీత్ బృందం గెలుపు సంతకం చేయాలనుకుంటోంది.
Moments of sheer joy! ✨
Debutant Vaishnavi Sharma receives her #TeamIndia T20I cap from Captain Harmanpreet Kaur 🧢 🇮🇳
Updates ▶️ https://t.co/T8EskKzzzW#INDvSL | @IDFCFIRSTBank | @ImHarmanpreet pic.twitter.com/GpeCrGxTbk
— BCCI Women (@BCCIWomen) December 21, 2025
భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నిలాక్షి డిసిల్వా, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), కవిశ దిల్హరి, మల్కి మదర, ఇనొక రణవీర, కావ్య కవింది, శషిని గిహ్మని.