బర్మింగ్‌హామ్: రెండో టెస్టులో స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడంపై భారత సారథి శుభ్‌మన్ గిల్ స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై చరిత్రాత్మక విజయం అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘కుల్దీప్ వంటి బౌలర్ జట్టులో ఉండగా అతడిని తుదిజట్టులోకి తీసుకోవాలని టెంప్టింగ్గా ఉంటుంది.
కానీ అతడిని బెంచ్‌పై కూర్చోబెట్టడానికి కారణం లోయరార్డర్లో బ్యాటింగ్ లోతు కోసమే. నేను, వాషింగ్టన్‌తో కలిసి నిర్మించిన భాగస్వామ్యం మ్యాచ్‌కు కీలకమైంది. ఒకవేళ సుందర్‌తో నా భాగస్వామ్యం లేకుంటే మ్యాచ్‌లో మేం 70, 80 పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించేవాళ్లం. మానసికంగా 180 రన్స్ ఆధిక్యం అనేది ఎంతో ఉత్సాహాన్నిస్తుంది’ అని అన్నాడు.