బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఏ’తో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్ పుంజుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 93/5తో రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఏ’ 299 పరుగులు చేసింది. వర్షం కారణంగా 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాలో ఉన్న జట్టును రాగ్వి బిస్త్ (153 బంతుల్లో 99, 16ఫోర్లు), జోషిత (51) అర్ధసెంచరీలతో ఒడ్డున పడేశారు. ముఖ్యంగా రాగ్వి..ఆసీస్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తూ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది.
కెప్టెన్ రాధాయాదవ్(33)తో కలిసి ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించిన బిస్త్..మిన్ను మణి(33)తో కలిసి స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేసింది.మరోవైపు జోషిత కూడా రాణించడంతో భారత్ పోరాడే స్కోరు అందుకుంది. బ్రౌన్, ప్రెస్ట్బ్రిడ్జ్ మూడేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. సైమా ఠాకూర్ (2/21), రాధాయాదవ్( 2/40) ధాటికి కంగారూలు నిలదొక్కుకోలేకపోయా రు. కెప్టెన్ విల్సన్ (49) ఆకట్టుకుంది.