Hockey World Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. రూర్కెలాలోని బిర్సా ముండా స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 2-0తో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. అమిత్ రోహిదాస్ పెనాల్టీ కార్నర్‌ను గోల్ మలిచాడు. ఆ తర్వాత హార్ధిక్ సింగ్ గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్థ భాగంలో ఇండియా డిఫెన్స్ అడ్డుగోడలా నిలవడంతో స్పెయిన్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. లోకల్ బాయ్ అమిత్ రోహిదాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో భారత్‌కు మూడు పాయింట్లు లభించాయి. ర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది.
భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్‌లో 16 జట్లు పాల్గొంటున్నాయి. భువనేశ్వర్, రూర్కెలాలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. జనవరి 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.