యుపియా : సాఫ్ అండర్-19 చాంపియన్‌షిప్ టైటిల్‌ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. ఆదివారం యుపియా (అరుణాచల్‌ప్రదేశ్)లో జరిగిన ఫైనల్లో భారత్ 1-1 (4-3)తో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. నిర్దేశిత సమయానికి ఇరు జట్ల స్కోర్లు సమం కాగా.. పెనాల్టీ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో యువ భారత్ అదరగొట్టింది.
మొదట 2వ నిమిషంలోనే గోల్ కొట్టిన భారత్.. ఆ తర్వాత ఆ జోరు చూపించలేకపోయింది. 61వ నిమిషంలో జాయ్ అహ్మద్ గోల్ చేయడంతో బంగ్లా స్కోరును సమం చేసింది. షూటౌట్లో భారత్ వరుసగా హ్యాట్రిక్ గోల్స్ చేసి విజేతగా నిలిచింది.