నార్త్సౌండ్(అంటిగ్వా): టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా సూపర్-8లోకి దూసుకెళ్లింది. బుధవారం నమీబియాతో పోరులో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని 5.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(34 నాటౌట్), వార్నర్(20) రాణించారు. తొలుత ఆడమ్ జంపా(4/12) ధాటికి నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు కుప్పకూలింది. మరోవైపు శ్రీలంక, నేపాల్ మధ్య వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యింది. దీంతో గ్రూపు-డీ నుంచి దక్షిణాఫ్రికా అధికారికంగా సూపర్-8లోకి ప్రవేశించింది.