IndiaVsAustralia | భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. సుమారు ఏడు నెలల విరామం తర్వాత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడనుండడంతో ఈ సిరీస్కు మరింత ఆకర్షణగా మారింది. ముఖ్యంగా, ఈ మ్యాచ్ ద్వారా తెలుగు యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. భారత్ జట్టు టాస్ ఓడిపోయినప్పటికీ, భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాకు గట్టి సవాల్ విసరాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయంగా 500 అంతకంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన క్రికెటర్ల జాబితాలో చేరబోతున్నాడు. రోహిత్ కంటే ముందు సచిన్ (664), విరాట్ కోహ్లీ (551), ఎంఎస్ ధోనీ (535), రాహుల్ ద్రవిడ్ (504) ఉన్నారు.
Nitish Kumar Reddy Odi Debut
Nithish