India vs England: ఇండియా, ఇంగ్లండ్ సిరీస్‌కు రికార్డు వ్యూయర్షిప్
ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్‌కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్‌కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ వెల్లడించింది.

లండన్: ఇండియా, ఇంగ్లండ్( India vs England ) సిరీస్‌కు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ వస్తోంది. గత మూడేళ్లలో ఇండియన్ క్రికెట్ టీమ్ ఆడిన విదేశీ ద్వైపాక్షిక సిరీస్‌లలో అత్యధిక వ్యూయర్షిప్ ఈ సిరీస్‌కే వచ్చినట్లు సోనీ స్పోర్ట్స్ వెల్లడించింది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ జరుగుతోంది. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉంది. 2018లో ఈ టీమ్స్ మధ్యే జరిగిన సిరీస్ కంటే ఇప్పుడు సగటు వ్యూయర్షిప్ 30 శాతం పెరిగినట్లు సోనీ స్పోర్ట్స్ తెలిపింది. ఇండియా, ఇంగ్లండ్ రెండో టెస్ట్ చివరి రోజు ఆటకు సగటు రేటింగ్స్ 70 శాతం వరకూ పెరిగాయి. ఇండియా గెలుస్తుందన్న అంచనాతో ఆ రోజు భారీగా మ్యాచ్‌ను చూశారు.
సుమారు 80 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇండియన్ టీమ్ విదేశాల్లో ఆడిన టెస్ట్ మ్యాచ్ ఒక రోజు వచ్చిన అత్యధిక ఇంప్రెషన్స్ ఇవే. ఆ రోజు చివరి సెషన్లో ఇంగ్లండ్ 120 పరుగులకే ఆలౌటైన సందర్భంలో కోటి 7 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి అని సోనీ స్పోర్ట్స్ చెప్పింది. లార్డ్స్ టెస్ట్‌లో ఇండియా గెలిచిన తర్వాత సోనీ చానెల్‌కు మరిన్ని బ్రాండ్లు క్యూ కట్టడం విశేషం. ఇప్పటికే ఈ సిరీస్‌కు 12 బ్రాండ్లు స్పాన్సర్లుగా ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

