సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) నువ్వానేనా అన్నట్లు ఆడుతున్నాయి. టీమ్ఇండియా 185 రన్స్‌కు ఆలౌట్ అవగా, ఆతిథ్య జట్టు 181 రన్స్‌తో సరిపెట్టుకుంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 157 రన్స్ మాత్రమే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 162 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 141/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా.. కాసేపటికే ఏడో వికెట్ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్‌లో జడేజా (13) కారెకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
మరో ఎండ్‌లో ఉన్న సుందర్ (12) కూడా 38.4వ ఓవర్లో కమిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 156 రన్స్‌కు 8 వికెట్లు పడిపోయాయి. సిరాజ్ కూడా క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. బోలాండ్ బౌలింగ్‌లో సిరాజ్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ బుమ్రా 3 బంతులు మాత్రమే ఎదుర్కొని బోలాండ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో 157 పరుగుల వద్ద టీమ్ఇండియా బ్యాటింగ్‌కు ఎండ్‌కార్డ్ పడింది.
162 రన్స్ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఘనంగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. సిరాజ్ వేసిన మొదటి ఓవర్లోనే 13 పరుగులు వచ్చాయి. రెండో ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణ తొలి బంతికే కెన్స్టప్ 4 కొట్టాడు. గాయంతో బాధపడుతున్న బుమ్రా ఫిల్డింగ్కు రాలేదు. దీంతో అతడు బౌలింగ్ వేస్తాడా లేదా అనే అనుమాణాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 26 రన్స్ చేసింది.