బౌలింగ్ కష్టాలు తీరేనా?
న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత్.. ఆదివారం ఆతిథ్య జట్టుతో చివరి పోరులో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను దక్కించుకున్నా ఆక్లాండ్‌లో శాంట్నర్ సేన ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని చివరి టీ20ని విజయంతో ముగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతుంది.
- సిరీస్‌లో 4-1పై కన్నేసిన టీమిండియా
- నేడే న్యూజిలాండ్‌తో ఐదో టీ20
- మ. 12.30 గం. నుంచి సోనీలో..
హమిల్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న భారత్.. ఆదివారం ఆతిథ్య జట్టుతో చివరి పోరులో తలపడనుంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను దక్కించుకున్నా ఆక్లాండ్‌లో శాంట్నర్ సేన ఇచ్చిన షాక్ నుంచి తేరుకుని చివరి టీ20ని విజయంతో ముగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతుంది. హమిల్టన్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని శ్రేయాస్ సేన ప్రణాళికలు రచిస్తోంది. అయితే బ్యాట్‌తో బాగానే బాదుతున్నా పర్యాటక జట్టు సమస్యంతా బౌలింగ్‌తోనే ఉంది.
కుల్దీప్ ఆడేనా?
నాలుగేండ్ల తర్వాత జట్టులోకి వచ్చిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు పేస్ దళం సిరీస్‌లో కివీస్ బ్యాటర్లకు ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నది. నాలుగు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ బ్యాటర్లు రెండుసార్లు 220+ స్కోర్లు చేయగా ఒకసారి 198 బాదారంటే భారత బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్ష్‌దీప్ ఒక్కడే ఉన్నంతలో మెరుగ్గా రాణిస్తున్నాడు.
సిరీస్‌లో భారత్ నుంచి అతడి ఎకానమీ మాత్రమే 10కి తక్కువగా ఉంది. భువీ మూడు మ్యాచుల్లో 11.58తో 138 రన్స్ సమర్పించుకోగా మయాంక్, ప్రిన్స్ అదే బాటలో ఉన్నారు. అక్షర్ అయితే మూడు మ్యాచుల్లో తీసింది ఒక్క వికెటే. ఈ నేపథ్యంలో నేటి పోరులో అక్షర్, నమన్ ధీర్లలో ఒకరిని పక్కనబెట్టి కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలలో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తున్నది. ఇక కివీస్ విషయానికొస్తే సిరీస్ కోల్పోయినా ఆక్లాండ్ మ్యాచ్‌లో విజయం ఆ జట్టులో కొత్త జోష్ నింపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

